సూపర్ స్టార్ రజినికాంత్ సినిమాలే వేరు. రజినికాంత్ సినిమాలు రిలిజ్ అవుతున్నాయంటే ధియేటర్ల ముందు జనాల హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్క తమిళ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా విడుదలకు ముందే బాక్సాఫిస్ వద్ద రికార్డులు సృష్టిస్తాయి. రిలిజ్ కు ముందే ప్రోడ్యూసర్లకు డబ్బులు మొత్తం వచ్చేస్తాయి. ఇందుకు ఉదాహరణ ఆయన నటించిన కబాలి చిత్రంగానే చెప్పుకొవచ్చు. ఇక శంకర్ దర్శకత్వంలో రజినికాంత్ చేస్తున్న సినిమాకు శాటిలైట్స్ కొన్ని కొట్ల రూపాయల్లో అమ్ముడుపోయాయంట. త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న కాలా సినిమా కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
తాజాగా రజీనికాంత్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రం రజినికాంత్ కెరీర్ ఇది 165వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాకు రజిని రూ.65కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొనున్నట్లు కోలీవుడ్ లో వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒక్క సినిమాకు రజిని 40రోజులు కాల్ షిట్లు ఇచ్చారంట. చైన్నైలో త్వరలో కాలా ఆడియో లాంచ్ కు హాజరుకానున్నారు. ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించారు.