//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిర్మాతలను భయపెడుతున్న సునీల్

Category : movies

సునీల్ కెరీర్ కమెడియన్ గా పీక్స్ లో ఉన్న టైంలో హీరోగా టర్న్ అయ్యాడు సునీల్. అప్పట్లో అందాలరాముడు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సునీల్ , ఆ తరువాత మళ్ళీ కమెడియన్ పాత్రలే చేసుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన మర్యాదరామన్న చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా టర్న్ అయిపోయాడు సునీల్.

పూలరంగడు కూడా బ్లాక్ బస్టర్. ఇంకా సునీల్ కి ఎదురులేదు అనుకున్నారు. కట్ చేస్తే హిట్ సినిమా లేకుండా పోయింది. మధ్యలో తడాకా తో మల్టీ స్టారర్ హిట్ అందుకున్నప్పడికి అది కెరీర్ కి ఉపయోగపడలేక పోయింది. ఇంకా హీరోగా కొనసాగటం కష్టం అయిపోతున్న పరిస్థితి ఏర్పడింది. సో , మళ్ళీ ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా మారిపోయాడు సునీల్.

ఆలా వచ్చిన సినిమాలు అరవింద సామెత వీరరాఘవ , అమర్ అక్బర్ ఆంటోనీ కానీ ఆ రెండు సునీల్ కి ఊహించిన కంబ్యాక్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితులలో సునీల్ కి హీరో గా ఆఫర్ వచ్చిందట. రాజ్ తరుణ్ తో అందగాడు సినిమా కి తెరకెక్కించి వెలిగొండ శ్రీనివాస్ సునీల్ కి ఒక కదా చెప్పాడట అది సునీల్ కి కూడా బాగా నచ్చి ఓకే చేసాడని తెలుస్తుంది. ఈ సినిమా ని ప్రొడ్యూస్ చెయ్యడానికి ఒక కొత్త నిర్మాత ముందుకు వచ్చాడట.

వెలిగొండ శ్రీనివాస్ 5 కోట్ల బడ్జెట్ లోపే ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలనుకుంటే , సునీల్ మాత్రం 1.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసాడట. దీంతో నిర్మాత వెంట అక్కడ నుండి జంప్ అయ్యాడట. వరుస ప్లాపుల్లో ఉన్న సునీల్ అంత డిమాండ్ చెయ్యటం పై కొందరు నోర్లు వెళ్లబెడతున్నారు.

Related News