ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ఈ సీజన్లో తొలి పరాజాయాన్ని రుచి చూసిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలిచి తిరిగి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది.
గత మ్యాచ్లో గాయపడ్డ శిఖర్ ధవన్ స్థానంలో సన్రైజర్స్ యువ ఆటగాడు రికి భుయిని జట్టులోకి తీసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఇమ్రాన్ తాహీర్ స్వల్ప అనారోగ్యంగా ఉండటంతో అతని స్థానంలో డుప్లెసిస్కి చోటు కల్పించింది. సన్ రైజర్స్ మళ్ళి విజయాల బాట పట్టాలని చూస్తుంది.