//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సన్ రైజర్స్ మరో హ్యాట్రిక్ విజయం...!

Category : sports

నిన్న ఐపీయల్ భాగం గా జరిగిన మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ మళ్ళి మెరిశారు. ముందుగా ఒక మాదిరి రన్స్ మాత్రమే సాధించారు. కానీ రైజర్స్ బౌలర్లు మళ్ళి తమ బలానికి పదును పెట్టి జట్టును విజయతీరాలకు చేర్చారు.

సన్ రైజర్స్ ని బౌలింగ్ విన్‌రైజర్స్‌గా చేసింది. దీంతో ఐపీఎల్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేసిన మూడో మ్యాచ్‌లోనూ గెలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 11 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (43 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలెక్స్‌ హేల్స్‌ (39 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించారు. రాయల్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ (3/26) కట్టడి చేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ రహానే (53 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సంజూ శామ్సన్‌ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాటం దుర్బేధ్యమైన రైజర్స్‌ బౌలింగ్‌ ముందు నిలువలేకపోయింది. సిద్ధార్థ్‌ కౌల్‌ 2 వికెట్లు తీశాడు.