//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్లేఆఫ్ లో సన్ రైజర్స్.....ముగిసిన ఆర్సీబీ పోరాటం...!

Category : sports

నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో బెంగళూర్ టీం చేతులెత్తేసింది. స్వల్ప లక్షాన్ని ఛేదించలేక ప్లేఆఫ్ కి దాదాపు అర్హత కోల్పోయింది.

కాగా ఇదే మ్యాచ్ లో మరోసారి స్వల్ప స్కోరును కాపాడుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 పాయింట్లను సాధించి ప్లే ఆఫ్ కు దాదాపు అర్హత సాధించింది. మ్యాచ్ ముగిసిన తరువాత ఈ మ్యాచ్ పై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, చేతిలో నాలుగు వికెట్లు ఉంచుకుని కూడా 5 పరుగులు సాధించలేకపోయామని తీవ్రమైన విచారం వ్యక్తం చేసాడు.

ఈ మెగా టోర్నీలో తమ జట్టుది దీనగాథని వ్యాఖ్యానించిన కోహ్లీ, చెత్త షాట్లు ఆడి వికెట్లను పారేసుకున్నామని చెప్పాడు. ఇక్కడ పిచ్ చాలా స్లోగా ఉందని అన్నాడు. కొంచెం కుదురుగా ఆడితే, పరుగులు సులువుగా సాధించవచ్చని మన్దీప్, గ్రాండ్ హోమ్ ల జోడీ నిరూపించిందని అన్నాడు. బౌలర్లు కనీసం 10 నుంచి 15 పరుగులు తక్కువగా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచిందని చెప్పడం కన్నా, తాము చేజేతులా ఓడిపోయామని అనడం సబబని వ్యాఖ్యానించాడు.

Related News