ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ ను ప్రకటించారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ పై నిషేధం నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరంటూ కొన్ని గంటల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది.
సన్ రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తూ ఫ్రాంచైజీ మేనేజిమెంట్ కీలక ప్రకటన చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌ను నియమిస్తున్నట్లు ఆ జట్టు అధికారికంగా ప్రకటించింది.
దీనిపై స్పందించిన విలియమ్సన్ తనకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నానని చెప్పాడు. ఇది తనకెంతో ప్రత్యేకమైనదని విలియమ్సన్ అన్నాడు.ఎంతోమంది టాలెంట్ కలిగిన ఆటగాళ్ల జట్టుకు సారథ్యం వహించడం ఆనందంగా ఉందని అన్నాడు. మొత్తం మీద బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఐపీఎల్లో కీలకంగా వ్యవహరించాల్సిన ఇద్దరు ఆసీస్ కీలక ఆటగాళ్లు వైదొలిగారు.