//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆరెంజ్ ఆర్మీ హ్యాట్రిక్ విజయం.....చెలరేగిన బౌలర్లు....!

Category : sports

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్‌తో పాటు మెరుపు ఫీల్డింగ్‌తో అందరిని మెప్పించి వరుసగా మూడో విజయాన్నితమ ఖాతాలో వేసుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్ కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది.

మొదటగా టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫీల్డిగ్‌ను ఎంచుకుంది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన కోల్ కత్తా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌ రాబిన్ ఊతప్ప వికెట్‌ను త్వరగా కోల్పోయింది. క్రిస్‌ లైన్‌ 49 పరుగులు చేసి కొల్‌కతా నైట్‌ రైడర్స్ ను ఆదుకున్నాడు. 7బౌండరీలతో ఒక భారీ సిక్స్‌ర్‌తో స్కోర్‌ బోర్డును ఒంటి చేత్తో కొద్దిసేపు పరుగులు పెట్టించాడు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 29) రాణించాడు. మిగిలిన బ్యాటమెన్స్ అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. సన్ రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3/26), షకీబల్‌ హసన్‌ (2/21), స్టాన్‌లేక్‌ (2/21) తో సత్తా చాటారు. దీనితో కోల్ కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది.

తరువాత 139 పరుగుల సులభమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ కు మంచి ఆరంభం లభించింది. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 50), షకీబల్‌ హసన్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) సత్తాచాటడంతో హైదరాబాద్‌ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సునీల్‌ నరైన్‌ (2/17) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. ఈ విజయం తో పతకాల పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతుంది సన్ రైజర్స్.

Related News