//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్లేఆఫ్ లోకి సన్ రైజర్స్...ఢిల్లీ ఇక ఇంటికే...!

Category : sports

ఐపీయల్ 2018 సీజన్ లో ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన మొదటి జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. నిన్న ఢిల్లీ డెర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించటం తో మన జట్టు సగౌరవంగా ప్లేఅఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు సన్ రైజర్స్ 11 మ్యాచ్లను అడగా, వాటిల్లో 9 విజయాలు, 2పరాజయాలు వున్నాయి. పాయింట్స్ పట్టికలో 18 పాయింట్స్ లో సన్ రైజర్స్ మొదటిస్థానం లో కొనసాగుతుంది.

నిన్న మొదటగా టాస్ గెలిచినా ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కి దిగింది. కానీ ఆ జట్టుకు మొదటి పది ఓవర్లు కలిసి రాలేదు. సాకిబ్ వేసిన తన మొదటి ఓవర్ లోనే ఓపెనర్స్ ఇద్దరిని పెవిలియన్ కు పంపాడు. ఈ దశ లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ అయ్యర్, పంత్ తో సమన్వయ లోపం కారణం గా అయ్యర్ రన్ అవుట్ గా వెనుదిరిగాడు. తరువాత పటేల్ కొంచెంసేపు పంత్ కి సహకారం అందించాడు.

ఈ దశ లో పంత్ చెలరేగి ఆడాడు, ఐపీయల్ లోనే బెస్ట్ బౌలింగ్ వున్న జట్టు పై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తరువాత పటేల్ కూడా స్పీడ్ పెంచాడు. తరువాత కాసేపటికి పటేల్ కూడా పంత్ కారణం గా రన్ అవుట్ రూపం లో వెనుదిరిగాడు. తరువాత పంత్ సన్ రైజర్స్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు.128 పరుగులతో చివరి వరకు నిలబడి తమ జట్టుకు గౌరవమైన స్కోర్ ని అందించాడు. ప్రపంచం లోనే వన్ అఫ్ ది బెస్ట్ బౌలర్ గా వున్న భువి వేసిన లాస్ట్ ఓవర్ లో పంత్ 4, 4, 6, 6, 6గా మలచి స్టేడియాన్ని హోరెత్తించాడు. చివరి నాలుగు ఓవర్లలో పంత్‌ 18 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. మొత్తంగా ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది.

తరువాత భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ధాటిగా ఆరంబించారు, కానీ దూకుడుగా ఆడుతున్న హేల్స్‌ (14) వికెట్‌ను రెండో ఓవర్‌లోనే కోల్పోయింది. తరువాత క్రీస్ లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్, ఓపెనర్ ధావన్ మరో వికెట్ పడకుండా చూసుకుంటూ విజయం వైపు నడిపించారు.

శిఖర్‌ ధవన్‌ (50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 నాటౌట్‌), కేన్‌ విలియమ్సన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 83 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొట్టడంతో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. మరో ఏడుబంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శిఖర్‌ ధవన్‌కు దక్కింది. దీనితో ఈ సీజన్ ప్లేఅఫ్ రేస్ నుండి ఢిల్లీ తప్పుకుంది.