//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Telugu anchor suma kanakala : తెలుగు యాంకర్ సుమ కనకాల : suma kanakala family children

Category : editorial

సుమ ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ యాంకర్ లల్లో ఒకరు.సుమ మార్చి 22, 1974 లో జన్మించారు.ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది.

1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప. సుమ తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి పి.విమల చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. ఆంధ్రాలో చిన్నప్పట్నుంచీ ఉండటంతో ఆమె తెలుగు బాగా మాట్లాడతారు. చదువుకునేటప్పుడు కూడా ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో తన తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు ఆమె. 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు సుమ.

కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు యాంకరింగ్‌ చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తున్నారు. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యానం చేసి మంచి గుర్తింపును పొందారు.

టివి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

సుమ చేసిన టి.వి.కార్యక్రమాలు ;

క్యాష్,స్టార్ మహిళ,పంచావతారం,సూపర్ సింగర్,అవాక్కయ్యారా,జీన్స్,భలే చాన్సులే,పట్టుకొంటే పట్టుచీర,లక్కుకిక్కు,

సుమ గారు నటించిన సినిమాలు ;

కళ్యాణ ప్రాప్తిరస్తు,వర్షం,ఢీ,బాదుషా,స్వయంవరం,గీతాంజలి,రావోయి చందమామ,స్వరాభిషేకం.

పురస్కారాలు ;

2009లో ఈటీవీ మరియు కోకొకోలా సంస్థలు తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉత్తమ టివి యాంకర్ల కోసం నిర్వహించిన "లిమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్" కార్యక్రమంలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు.

2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (పంచావతారం) నంది పురస్కారాన్ని అందుకున్నారు.

2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) లోకల్ టీవి మీడియా పురస్కారాన్ని అందుకున్నారు.

2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) సినీగోర్ పురస్కారాన్ని అందుకున్నారు.

Related News