//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమిత్ షా, జైట్లీలతో భేటీ అయిన సుజనా చౌదరి

Category : politics

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న బంద్, ఆందోళనల గురించి సుజనా చౌదరితో వారు వాకబు చేశారు. జరుగుతున్న పరిస్థితిని వారికి సుజనా వివరించారు. ఇదే సందర్భంగా విభజన చట్టంలోని అంశాలను అమిత్ షాకు మరోసారి వివరించారు.

మరోవైపు ఏపీ ఎంపీల ఆందోళనలతో ఉభయసభలు అట్టుడికాయి. ఈ నేపథ్యంలో, రాజ్యసభను ఛైర్మన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. లోక్ సభ మాత్రం ఆందోళనల మధ్యే కొనసాగుతుంది.

Related News