//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ పాటే టైటిల్‌గా సుధీర్‌బాబు చిత్రం..!

Category : movies

క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ హీరోగా త‌నేంటో నిరూపించుకున్న సుధీర్‌బాబు ఇప్పుడు నిర్మాత‌గా మార‌బోతున్నాడు. సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో త‌నే హీరోగా న‌న్ను దోచుకుందువ‌టే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సుదీర్ బాబు స‌ర‌స‌న క‌న్న‌డ న‌టి న‌వా న‌రేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

స‌మ్మోహ‌నంతో సూప‌ర్‌హిట్ కొట్టిన సుధీర్ బాబు మ‌రోసారి వైవిధ్య‌మైన సినిమాతో సినీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. న‌న్నుదోచుకుందువ‌టే మోష‌న్ టీజ‌ర్ చూసిన వారంద‌రికీ క‌చ్చితంగా ఈ ఫీలింగ్ క‌లుగుతుంది. సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఓ చిత్రంలోని పాట‌నే టైటిల్‌గా పెట్టి చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం గ‌మ‌నార్హం.