//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ ఫోటో ఒక జీవితాన్నే మార్చేసింది !

Category : world

అందం గురించి ఇప్పటి వరకూ ఎందరో, ఎన్నో విధాలుగా రాశారు.

కాని అందం అనేది సదరు వ్యక్తి అంగీకారం నుండే, ఆ వ్యక్తి సౌకర్య స్థాయి నుండే అనుభూతమవుతుందని ఒక వక్త అన్నారు. మీరు ఎవరు అన్న విషయం పట్ల మీరు సౌకర్యంగా, సుఖప్రదంగా ఉంటే మీకు చాలా అందంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఐదడుగుల ఒక అంగుళం ఉన్న మహిళ ఎత్తుమడమల చెప్పులు ధరించకుండా మామూలు చెప్పులతో ఒక పార్టీకి వెళితే దాన్ని మనం ఒక స్పెషాలిటీగా భావిస్తాం.

మనల్ని మనం అంగీకరించినప్పుడు, మన ఆత్మవిశ్వాసస్థాయి ఇతరులను మన వైపు ఆకర్షిస్తుంది, బహుశా నిజమైన అందం అదే అయి ఉంటుంది. అదే విధంగా మీరు చదవబోయే విషయం చూస్తే ఔరా అనిపించక మానదు. సుడాన్‌కు చెందిన ఓ మోడల్‌ జీవితం ఒక్క ఫోటోతో ఎలా మారిపోయిందంటే.. రాత్రికి రాత్రే ఆమెను ఈ భూమ్మీద అత్యంత అందగత్తెగా మార్చి పడేసింది.

అనోక్‌ యాయి.. వాషింగ్టన్‌లో హోవార్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్‌ని ఆమె రూపం బాగా ఆకర్షించింది. దీంతో అతను ఓ ఫోటో తీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ క్రమంలో ఓ చిత్రం ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడంత మంది అభిమానులను సంపాదించిపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించటమే కాదు.. తక్కువ కాలంలోనే ఆమెను సూడాన్‌ సూపర్‌ లేడీగా మార్చేసింది.

అయితే ఆమె ఎదిగే క్రమంలో ఎక్కడా ఆమెపై జాతి వివక్ష కామెంట్లు రాకపోవటం విశేషం. ప్రస్తుతం ఆమె సంపాదన గంటకు 15,000 వేల డాలర్లపైగానే ఉందంట. అంతర్జాతీయ మాగ్జైన్‌లు సైతం టాప్‌ సెక్సీ మోడళ్లను పక్కన పడేసి ఇప్పుడు ఆమె ముఖచిత్రం కోసం ఎగబడిపోతున్నాయి.

Related News