//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెళ్ళికావడంలేదు అని మనస్తాపానికి గురై యువకుడి ఆత్మహత్య....!

Category : state

ఆత్మహత్యలు అంటే ఈ మధ్య అది ఒక ఆటలా తయారు అయ్యింది. ప్రేమ ఫలించలేదు అని ఒకరు, పరీక్షలు ఫెయిల్ అయ్యామని ఒకరు, పెళ్లిళ్లు కావడం లేదు అని ఇంకొకరు ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య అందరికి కామన్ అయిపోయంది. ఇంకా వివరాలలోకి వెళ్తే

భోగాపురం పంచాయతీ ఎస్సీబీసీ కాలనీకి చెందిన చిదిపల్లి రామకృష్ణ (24) ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్టు ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాలు ప్రకారం.. రామకృష్ణ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు.

రామకృష్ణ తన తమ్ముడితో పాటు బంధువులైన దాసరి గురమ్మ, సీహెచ్‌ గోవింద కుటంబాల వద్ద ఉండేవారు. వారు పెద్ద అయ్యాక ఇద్దరు కలిసి ఎస్సీబీసీ కాలనీలో నివాసం వుంటున్నారు. రామకృష్ణ నిరంతరం మద్యం సేవిస్తుండేవాడు. రామకృష్ణకి కొన్ని నెలలుగా వివాహం చేద్దామని బంధువులు నిశ్చయించారు.

అయితే రామకృష్ణకు ఉన్నఅలవాట్లు సైతం అతనికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పెళ్లి కావడంలేదు అన్న బాధతో మనస్తాపానికి గురి చెందిన రామకృష్ణ మద్యం మత్తులో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తారకేశ్వరరావు సంఘటన స్థలానికి వెళ్లి, మృత దేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Related News