దేశంలోని ఏడుగురు లోక్‌సభ సభ్యులు, 98 మంది ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగాయని తమ విచారణలో వెల్లడయినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వీరికి సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి త్వరలో అందజేస్తామని సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
సుమారు 26 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 257 మంది ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ఎన్నికల్ అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారని లక్నోకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆరోపించడంతో ఐటీ అధికారులు విచారణ జరిపారు. అలాగే మరో తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 42 మంది ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కింపు కూడా కొనసాగుతోందని కోర్టుకు సీబీడీటీ తెలిపింది.