//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కి ఝలక్ ఇచ్చిన చంద్రబాబు ప్రత్యర్ధి

Category : politics

జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకి గాను అన్ని జిల్లాలలో ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తున్న తరుణాన జగన్ సంతోషానికి అవధులు లేకుండా ఉంది.

అయితే ఆయన ఆనందానికి బ్రేకులు పడేలా చిత్తూరు జిల్లాలో గట్టి జలక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. తాజాగా సోమవారం చిత్తూరు జడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రహ్మణ్యంరెడ్డి టీడీపీ పార్టీ లోకి వెళ్లి అందరి సమక్షంలో పచ్చ కండువా కప్పుకొని జగన్ కి జలక్ ఇచ్చాడు.

సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్యం రెడ్డితోపాటు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సుబ్రహ్మణ్యం రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. విభజన తర్వాత రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకున్నట్టు చెప్పారు. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Related News