//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలివుడ్ స్టార్ కి కేరళ ఆహ్వానం...

Category : movies

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. అక్కడ బన్నికి అభిమానులు ఎక్కువగా ఉండటంతో అతని సినిమాలను నిర్మాతలు అక్కడ కూడా విడుదల చేసి మంచి వసూళ్లు రాబట్టుకుంటూ ఉంటారు.

ఇక ఇటీవల వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తిన సమయంలో కూడా అతను పెద్ద మనసు చాటుకున్న సంగతి అందరికి తెలిసిందే. రూ.25 లక్షల ఆర్థిక సాయమందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేరళ ప్రభుత్వం అలప్పిలోని మాడ లేక్‌లో ఈ నెల 10న జరగబోయే ‘నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌’‌కు ప్రత్యేక అతిథిగా బన్నీని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం కూడా పంపించింది. దీనితో అక్కడి అభిమానులు బన్ని కోసం ఎదురు చూస్తున్నారు. మరొక ఇద్దరు టాలివుడ్ హీరోలకు కూడా ఆహ్వానం పంపినట్టు సమాచారం.