//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టన్నింగ్ న్యూస్ ... అవసరానికి ఆంధ్రోళ్లు మనోళ్ళే అన్న కేటీఆర్

Category : state

ఆంధ్రా నాయకుడు చంద్రబాబు, తెలంగాణా రాష్ట్రాన్ని మళ్ళీ ఆ ఆంధ్రోళ్ళకు అప్పగిస్తారా అంటూ ఆంధ్రా ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ అవసరాన్ని బట్టి ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో సెటిలర్స్ ను ఇప్పుడు తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడితే కొడుకు కేటీఆర్ మాత్రం అది కేవలం రాజకీయం అని చెప్పి సెటిలర్స్ ని నమ్మించే ప్రయత్నం చేసారు.

నిన్నటి వరకు చంద్రబాబుని, ఆంధ్ర ప్రజలను తిట్టిన టీఆర్ఎస్ ఎన్నికల ఓట్ల కోసం కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. కేటిఆర్ ఒక కార్యక్రమంలో పాల్గొని కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్, బిజెపి అన్యాయం చేశాయని చెప్పిన ఆయన సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారని చెప్పే నిజాంపేటలో అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చకు కారణంగా మారాయి. కేసీఆర్ కొడుగ్గా.. టీఆర్ ఎస్ నాయకుడిగా తాను హామీ ఇస్తున్నానని.. "ఇక్కడ ఉండే రాయలసీమ.. కోస్తాంధ్ర ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానంటూ.. మీరుందరూ నన్ను సోదరుడిగా భావించండి. మీ అందరికి వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేసీఆర్ కుమారుడిగా.. టీఆర్ ఎస్ నాయకుడిగా హామీ ఇస్తున్నా. పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కన పెట్టండి" అని వ్యాఖ్యానించారు.గడిచిన కొద్ది రోజులుగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రుల్ని ఉద్దేశించి కాదని.. ఆయన విమర్శించింది చంద్రబాబునేనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో టీఆర్ఎస్ కు అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమేనని.. వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని కోరారు.

తండ్రి కేసీఆర్ నోరు తెరిస్తే ఆంధ్రోళ్లు అని మాట్లాడతాడు. కొడుకు అబ్బే మిమ్మల్ని ఉద్దేశించి కాదు అని నమ్మించే యత్నం చేస్తాడు. అంతే కాదు అమరావతి నిర్మాణానికి 100 కోట్లు ఇద్దామని కేసీఆర్ అనుకుంటే మోడీ మట్టి, నీళ్ళు తెస్తున్నారని అంతకు మించి మనం తీసుకెళ్తే బాగోదని కేసీఆర్ ఆప్రయత్నం విరమించుకున్నారట ..వినే వాళ్ళు ఉంటె తండ్రి కేసీఆర్ అలాగే కుమారుడు కేటీఆర్ ఏమైనా చెప్తారు. ఎంత పెద్ద అబద్దం అయినా ఇట్టే ఆడేస్తారు. వాళ్ళు ఎంత చెప్తే మాత్రం సెటిలర్స్ వాలల మాటలను నమ్మి ఉంటారా చెప్పండి.

Related News