//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చదివేది బీటెక్‌..... చేసేది హైటెక్ చోరీ

Category : national

జల్సాలకు మరిగినన ఓ బీటెక్‌ విద్యార్థి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఓ రైలులో చోరీ చేయగా.. శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు రూ. లక్ష విలువైన బంగారు అభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. వరంగల్‌ జీఆర్‌పీ స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ సీఐ ఎం.రవిబాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్‌పీ సీఐ జూపల్లి వెంకటరత్నం చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.జయశంకర్‌ జిల్లాకేంద్రంలోని హనుమాన్‌ నగర్‌కు చెందిన చవాన్‌ యశ్వంత్‌ కుమారుడైన చవాన్‌ సూరజ్‌ (21) హైదరాబాద్‌ మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు.అయితే జల్సాలకు అలవాటుపడిన సూరజ్‌ డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఈనెల 21న మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో తన రూమ్‌మేట్‌ ఇచ్చిన పార్టీకి హాజరైన సూరజ్‌.. అదేరాత్రి 9గంటలకు వరంగల్‌ వెళ్తున్న పుష్‌పుల్‌ రైలు ఎక్కాడు. అదే రైల్లో వరంగల్‌ శివనగర్‌కు చెందిన చిట్టి శ్రీనివాసరావు (39), భార్య ప్రసన్న(35) పిల్లలతో కలిసి కొత్తగూడెం నుంచి వరంగల్‌కు వస్తున్నారు. అర్ధరాత్రి రైలు వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో అగుతున్న సమయంలో ప్రసన్న తన హ్యాండ్‌ బ్యాగును పక్కకు పెట్టి నిద్రలో ఉన్న పిల్లలను లేపుతుండగా.. సూరజ్‌ హ్యాండ్‌ బ్యాగును పట్టుకుని రైలు నుంచి 1వ ప్లాట్‌ఫామ్‌పైకి దూకి పారిపోయాడు.

దీంతో శ్రీనివాసరావు దంపతులు మరుసటి రోజు వరంగల్‌ జీఆర్‌పీలో ఫిర్యాదు చేశారు. హ్యాండ్‌ బ్యాగులో 39.663 గ్రాముల బంగారు చంద్రహారం, 9.890 గ్రాముల కమ్మలు, సెల్‌ఫోన్‌తో కలిపి మొత్తం రూ. లక్ష విలువైన ఆభరణాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో హైదరాబాద్‌ వెళ్లేందుకు రైలు కోసం ఎదురుచూస్తున్న సూరజ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పుష్‌పుల్‌లో చోరీ విషయం ఒప్పుకున్నాడు. దీంతో అతడి నుంచి రూ.లక్ష విలువైన బంగారు అభరణాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ చెప్పారు.అయితే సూరజ్‌ గతంలో చిన్నచిన్న దొంగతనాలు చేశాడని సీఐ వెంకటరత్నం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సై పి.శ్రీనివాస్‌, హెడ్‌కానిస్టేబుళ్లు మురళి, రాజేందర్‌, కానిస్టేబుల్‌ జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.