//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యూపీ సీఎం యోగికి చేదు అనుభవం

Category : national state

పలు కీలక నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. లక్నో యూనివర్శిటీ ఎదుట యోగి కాన్వాయ్ ను చుట్టుముట్టిన పలువురు విద్యార్థులు... ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యోగి హయాంలో దళితులు, ముస్లింలపై హింస పెరిగిపోయిందని వారు నినాదాలు చేశారు. రోడ్డుకు అడ్డంగా విద్యార్థులు పడుకోవడంతో, యోగి కాన్వాయ్ కాసేపు ఆగిపోయింది. ఈ నిరసన కార్యక్రమంలో సమాజ్ వాదీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ ఎఫ్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఒక సబ్ ఇన్స్ పెక్టర్, ఆరుగురు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 14 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు విద్యార్థినులు ఉండటం గమనార్హం.