//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికాలో కాల్పులు విద్యార్థులు మృతి..!

Category : national

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ప్యాషన్‌గా మారిన గన్‌కల్చర్ అమాయకులైన విద్యార్థులను బలిగొంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పార్క్‌ల్యాండ్‌లో ఓ దుండగుడు మారణహోమం సృష్టించాడు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పార్క్‌ల్యాండ్‌లోని మార్జోయ్‌ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో చదువుతున్న నికోలస్‌ క్రజ్‌(19)పై కొద్దిరోజుల క్రితం పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుని, అతడిని సస్పెండ్ చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన క్రజ్ పాఠశాలలోకి చొచ్చుకొచ్చి విచాక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ కాల్పుల్లో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి, మిగతా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పాఠశాలలోకి ప్రవేశించిన వెంటనే కాల్పులకు తెగబడిన దుండగుడు, అడ్డుకున్న ముగ్గురిని కాల్చేశాడు. అనంతరం పాఠశాలలోని ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏదో జరిగిపోతుందన్న కంగారులో అందరూ ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడే కాచుకుని ఉన్న క్రజ్ వచ్చిన వారిని వచ్చినట్లు కాల్చి చంపేశాడు.

అయితే అప్పటికే కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగుడు పాఠశాల భవనంలో దాక్కున్నాడు. అనంతరం పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా దుండగుడిపై ఎదురు కాల్పులకు దిగారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.