//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీచర్ ని రేప్ చేస్తానన్న 7 వ తరగతి విద్యార్ధి !

Category : national

పాఠశాలకు వెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు. పాటలు చెప్పే పాఠకులకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. త‌న‌కు పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయురాలిని రేప్ చేస్తాన‌ని బెదిరించాడు ఏడో తర‌గ‌తి చదువుతున్న ఓ బాలుడు. అదే పాఠ‌శాల‌కు చెందిన ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థి త‌న టీచ‌ర్‌కు అస‌భ్య‌క‌ర ఈమెయిల్ పంపాడు. కేండిల్ లైట్ డేట్‌కు,శృంగారానికి అంగీక‌రించ‌వ‌ల‌సిన‌దిగా లేఖ రాశాడు. ఈ ఇద్ద‌రు విద్యార్థులూ గుర్గావ్‌లోని ఓ పాఠ‌శాల‌కు చెందిన వారు. ఈ రెండు ఘ‌ట‌న‌లూ గ‌త వార‌మే జ‌రిగాయి.

సరిగ్గా చదవడం లేదని సెవెన్త్ క్లాస్ విద్యార్థిని టీచర్ మందలించగా, ఆమెపై, ఆమె కుమార్తెపై అత్యాచారం చేస్తానని ఆన్ లైన్ ద్వారా టీచ‌ర్‌ను బెదిరించాడు. ఆ టీచ‌ర్ కూతురు ఆ బాలుడు చ‌దువుతున్న క్లాస్‌లోనే చ‌దువుతోంది.ఈ బెదిరింపు గురించి తెలుసుకున్న ఆ బాలిక త‌ర్వాతి రోజు నుంచి పాఠ‌శాల‌కు రావ‌డం మానేసింది. ఆ బెదిరింపు గురించి ఉపాధ్యాయురాలు మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ బాలుణ్ని పాఠ‌శాల నుంచి సస్సెండ్ చేసి కౌన్సిలింగ్ క్లాసుల‌కు పంపారు.

రెండో ఘ‌ట‌న‌లో అదే స్కూల్ లో చదువుతున్నా ఎనిమిదో తరగతి విద్యార్థి,టీచ‌ర్‌ను శృంగారానికి ఆహ్వానించిన బాలుణ్ని కూడా స‌స్పెండ్ చేసి విచార‌ణ చేస్తున్నారు .అది సైబ‌ర్ ప్రాంక్ అని పాఠ‌శాల య‌జ‌మాన్యం తెలిపింది.ఆ బాలుణ్ని కూడా కౌన్సిలింగ్‌కు త‌ర‌లించారు. ఇది స్త్రీ,మైన‌ర్‌ల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో పాఠ‌శాల పేరు బ‌య‌ట‌పెట్ట‌లేదు.

తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే పిల్లలు చెడిపోతున్నారని తేలింది. అరచేతిలోకి ఇంటర్నెట్ వచ్చేయడంతో చూడకూడనివి కూడా పిల్లలు చూసి చెడిపోతున్నారని నిపుణులు అంటున్నారు. ఘటనలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ శకుంతల ధుల్ స్పందించి,విద్యార్థులకు,పాఠశాలకు నోటీసులు పంపామని,వారిని విచారణకు పిలిచి ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.స్కూలు యాజమాన్యం,ఉపాధ్యాయులు,విద్యార్థులు అందరికీ కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు.

Related News