//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మర్మాంగం ఎత్తుకుపోయిన దుండగులు..!

Category : national

హఠాత్పరిణామంతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.నాలుగు రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడి మర్మాంగాన్ని దుండగులు కోసుకెళ్లారు.మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.25 ఏళ్ల ఓ యువకుడికి ఫిబ్రవరి 6న ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేశారు.గురువారం (ఫిబ్రవరి 1) ఉదయం సదరు యువకుడు సరదాగా స్థానికంగా ఉన్న నదీ తీరానికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న అతడిపై ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా దాడి చేశారు.

యువకుణ్ని అపహరించిన దుండగులు పొదలమాటుకు లాక్కెళ్లి అతడి లైంగిక అవయవాలను కోసేశారు. అనంతరం కోసిసిన మర్మాంగాన్ని తమతోపాటే తీసుకొని పారిపోయారు.తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుణ్ని గమనించిన స్థానికులు వెంటనే అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.చికిత్స నిమిత్తం అతణ్ని ఆసుపత్రికి తరలించారు.కోసేసిన జననావయవాలను దుండగులు తమతో పాటే తీసుకెళ్లడంతో శస్త్ర చికిత్స ద్వారా పునరుద్ధరించే వీలు లేకుండాపోయింది.

కక్షపూరితంగా కావాలనే ఎవరో ఇలా చేశారని అతడి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుడు వివాహం చేసుకోవాల్సిన యువతిని పెళ్లి చేసుకోవాలని భావించి లేదా అందుకు విఫలమైన వారెవరైనా ఇలా చేసి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.యువకుడి కుటుంబసభ్యులు మాత్రం అనుమానితులకు సంబంధించి ఎలాంటి పేర్లు తెలపలేదు.