ఇన్వెస్టర్లకు కేంద్ర బడ్జెట్ ఇచ్చిన షాక్‌తో దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్ల మేర కిందకి పడిపోయింది. నిఫ్టీ సైతం 11వేల మార్కు దిగువకు దిగజారింది.
ప్రస్తుతం సెన్సెక్స్ భారీగా 262 పాయింట్ల నష్టంలోనే 35,644 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 83 పాయింట్ల నష్టంలో 11 వేల కింద 10,934 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ ఇండెక్స్ 313 పాయింట్లు పడిపోయి 1.5 శాతం నష్టపోయింది.
అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. 52 పైసలు బలహీనపడి 64.10 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఎల్టీసీజీ పన్ను, భారీ పారిశ్రామిక వర్గాలు ఎప్పటి నుంచో కోరుతున్న కార్పొరేట్ పన్నును తగ్గించకపోవడం, ద్రవ్యలోటు లక్ష్యం పెంపు వంటి కారణాలతో మార్కెట్లు పడిపోతున్నాయని విశ్లేషకులు చెప్పారు.