//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్స్..!

Category : national

స్టాక్‌ మార్కెట్‌లో శుక్రవారం నెలకొన్నపరిస్థితి సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనూ కొనసాగుతోంది. మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌ సందర్భంగా కూడా భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్‌ ప్రారంభంలోనే ఏకంగా 500 పాయింట్ల మేర పడిపోయింది. ప్రస్తుతం 398 పాయింట్ల నష్టంలో 34,669 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 10,600 మార్కు కిందకి పడిపోయింది. ప్రస్తుతం నిఫ్టీ భారీగా 137 పాయింట్లు క్షీణిస్తూ 10,623 వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌లో శుక్రవారం నుంచి నెలకొన్న అమ్మకాల ఒత్తిడి నేటి మార్కెట్లను పడగొడుతోంది.

మరోవైపు అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతం మేర నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 3 శాతం మేర డౌన్‌ అయింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మాత్రమే 0.35 శాతం బలపడగా. మిగిలిన అన్ని రంగాలూ నష్టాలోనే ట్రేడవుతున్నాయి.

రియల్టీ అత్యధికంగా 3.6 శాతం కుప్పకూలగా మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, ఫార్మాలు 3-1 శాతం మధ్య నష్టాలు గడిస్తున్నాయి. ఈక్విటీ లాభాలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధింపు స్టాక్‌ మార్కెట్‌ను నిండా ముంచుతోంది. ద్రవ్యలోటు అంచనాలు పెరగడం, ప్రపంచ మార్కెట్ల పతనం కూడా ప్రభావం చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమవుతున్నాయి. చాలా ఆసియన్‌ స్టాక్‌మార్కెట్లు 1 శాతం కిందకి ట్రేడవుతున్నాయి.