దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కొంతమేర లాభాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో షేర్ల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 107 పాయింట్లు పెరిగి 36,825కి ఎగబాకింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 11,134కు చేరుకుంది. బీజేపీ కి వచ్చే ఎన్నికలో కూడా తిరుగులేదని తెలుస్తున్న తరుణం లో ఇన్వస్టర్స్ ఎంతో ఉత్సహం చూపారు.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్స్ మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ (20.00%), టీటాఘర్ వాగన్స్ (19.96%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్స్ (17.61%), గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మాస్యూటికల్స్ (13.91%), సుజ్లాన్ ఎనర్జీ (12.90%).
బజాజ్ ఆటో, హీరో మోటార్స్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఒకానొక దశలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.93గా ట్రేడ్ అయింది. ఐటీ, మౌలిక రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం, అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటం మార్కెట్‌ను బలపర్చింది. దీంతో ఆరంభం నుంచే సూచీలు పరుగులు పెట్టాయి.