Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

Category : business

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలను నమోదుచేసాయి... దీనితో మరో కొత్త రికార్డులను నమోదు చేశాయి స్టాక్ మర్కెట్స్ . ఈ రోజంతా మర్కెట్స్ పైకి , కిందకి ఊగిసలాడినప్పటికీ, చివరకు లాభాల్లో ముగిశాయి. తద్వారా ఇప్పటివరకు లేని గరిష్ఠ స్థాయిని తాకాయి.

ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 38,286కు పెరిగింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 11,571 వద్ద స్థిరపడింది.

కజారియా సిరామిక్స్ (10.53%), కేఆర్ఎల్బీ లిమిటెడ్ (8.89%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (7.31%), సీఈఎస్సీ లిమిటెడ్ (7.01%), కమిన్స్ ఇండియా (6.70%) లాభాల్లో ఉండగా , హెచ్డీఐఎల్ (-4.85%), అమరరాజా బ్యాటరీస్ (-3.05%), జెట్ ఎయిర్ వేస్ (-2.94%), ఇండియా బుల్స్ రియలెస్టేట్ (-2.92%), డీఎల్ఎఫ్ (-2.91%) నష్టాలని చవిచూశాయి .