Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆస్ట్రేలియాను వదిలి దుబాయ్ చేరుకున్న స్టీవ్ స్మిత్....!

Category : sports

ఆస్ట్రేలియా క్రికెట్ ను బజారు పాలు చేసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా ను వదిలి దుబాయ్ చేరుకున్నాడు. శాశ్వతంగా తన స్వదేశాన్ని వీడాడా అనే అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతుంది. ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న తరువాత సౌతాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న స్మిత్, ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, తాను తప్పు చేసినట్టు అంగీకరించడంతో పాటు, క్షమించాలని వేడుకుంటూ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఆ తరువాత అక్కడనుండి నేరుగా కొద్దీ సమయం లోనే స్మిత్ దుబాయ్ విమానం ఎక్కేశాడు. క్రికెట్ కు సంబంధించి తన వద్ద ఉన్న వస్తువులన్నింటినీ ఆయన దుబాయ్ కి తీసుకుపోయాడు . తాను భవిష్యత్తులో దుబాయ్ లో క్రికెట్ అకాడమీని నెలకొల్పుతానని గతంలోనే వెల్లడించాడు.

ఆ కోరికను ఇప్పుడు తీర్చుకోనున్నాడని పలు ఆస్ట్రేలియా పత్రికలు కథనాలు రాశాయి. స్మిత్ ను ఆస్ట్రేలియాలో ఇక చూసేది కష్టమేనని అభిప్రాయపడ్డాయి. అతని పై నిషేధం ఏడాదిపాటే ఉన్నప్పటికీ, ఆ తరువాతైనా తాను ఆస్ట్రేలియా జట్టుకు ఆడేది అనుమానమేనన్న అంచనాతోనే స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దుబాయ్ లో అకాడమీకి సంబంధించిన సమాచారాన్ని స్మిత్ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.