//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లాస్ వెగాస్ దారుణం పక్కా ప్లాన్ తో చేసిందే

Category : world

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నరమేధానికి పాల్పడిన స్టీఫెన్ పెడ్డాక్‌ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈయన క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడలేదనీ, పక్కా ముందస్తు ప్లాన్‌తో మరణ మృదంగం సృష్టించాడనీ లాస్ వెగాస్ పోలీసులు చెపుతున్నారు. అన్నికంటే ముఖ్యంగా ఈ దారుణానికి పాల్పడే ముందు పెడ్డాక్ పది లక్షల డాలర్లను ఫిలిప్పీన్స్‌కు పంపినట్టు గుర్తించారు. ఈ నిధులు ఎవరికి పంపారు ఎందుకు పంపారన్న దానిపై పోలీసులు ఇపుడు ఆరా తీస్తున్నారు.

ఈ ఉన్మాది రియల్‌ ఎస్టేట్ వ్యాపారం, అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో భవనాలు, సొంతంగా రెండు విమానాలు, తుపాకులు ఉన్నాయి. అలాంటి పెడ్డాక్ అంతమందిని ఉన్మాదిలా ఎందుకు కాల్చిచంపాడన్నదానిపై ఆరా తీస్తున్నారు. పెడ్డాక్ మావాడే అన్న ఐఎస్ఐఎస్ ప్రకటన నేపథ్యంలో అతని వివరాలు మరింత జాగ్రత్తగా, నిశితంగా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ గదికి 23 తుపాకులను పది సూట్ కేసుల్లో సర్దుకుని తీసుకెళ్లాడని గుర్తించారు. దీంతో ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన సామూహిక హత్యాకాండ అని వారు చెబుతున్నారు.

Related News