//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భూమి మీద జీవనం ఇక వందేళ్ళే...

Category : world editorial

భూమి నశించి పోనున్నదా..? భూమిపై మానవజాతి మనుగడ ఇక కష్టమేనా ..? మరో వందేళ్లలో భూమి తన ఉనికి కోల్పోతుందా ..? ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రశ్న ఇది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తూ ...భయాన్ని పుట్టిస్తున్నాయి.

" మరో వందేళ్లలో ఈ భూమి ఉష్ణగోళంగా మారనున్నది. మానవ నివాసానికి అనుకూలంగా ఉండదు. ఈ లోగ విశ్వంలో మరో గ్రహాన్ని మన నివాసానికి వెదుక్కోవాల్సిందే, లేకుంటే మానవ మనుగడ కష్టమే అని హాకింగ్ హెచ్చరిస్తున్నాడు.

భూమ్మీద సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతుంది. అదే స్థాయిలో వాతావరణంలో భారీ మార్పులు వస్తున్నాయి. వివిధ దేశాలు తయారుచేస్తున్న అణు, జీవరసాయన ఆయుధాలు... ప్రాకృతిక వైఫల్యాలు ....ఇలా అన్ని కలిసి ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాయి. అదేవిధంగా పెరిగిపోతున్న జనాభా కూడా దీనికి ఒక కారణంగా హాకింగ్ చెబుతున్నాడు. కానీ కొందరు పరిశోధకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పట్లో భూమికి వచ్చే నష్టమేమి లేదని వారు అంటున్నారు.

ఎవరి మాటలు ఎలా ఉన్నా... భూమి మాత్రం డేంజర్ లో ఉందనేది స్పష్టమవుతుంది. మనం అభివృద్ధి చేస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన జీవనానికి ముప్పుగా మారబోతుందేమో ..చూద్దాం!.

Related News