//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Category : politics state

భారత మాజీ ప్రధాని, ‘భారత రత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయి అనారోగ్యం తో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు నివాళులర్పించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకర్లకు ఈ సమాచారాన్ని అందించారు.

రాష్ట్ర కొత్త రాజధాని నగరం నయా రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా మార్చాలని నిర్ణయించినట్లు అయన తెలిపారు. బిలాస్‌పూర్ విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, నిర్మాణంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లకు కూడా వాజ్‌పేయి పేరు పెడతామని తెలిపారు. వాజ్‌పేయి హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది తెలియచేసారు.