Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టార్ హోటల్ లో ఉద్యోగిని చీర లాగారు.. ఫిర్యాదు చేస్తే ఉద్యోగమే లేదన్నారు

Posted 5 months ago | Category : national

దేశ రాజధాని ఢిల్లీ లో మహిళలకు ఎక్కడా భద్రత లేదని మరో సారి రుజువైంది. ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని ఒక  ఓ ఫైవ్‌ స్టార్ హోటల్‌లో మహిళా ఉద్యోగిని భద్రత అధికారి చీర లాగి వేధించారు. ఫిర్యాదు చేసిన ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు. చీర లాగుతున్న వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూ ఉండడంతో హోటల్ యాజమాన్యం ఆత్మరక్షణలో పడింది.

ప్రముఖ ఎరోసిటీ హోటల్ లో ఈ ఘటన గత నెల 29న చోటుచేసుకుంది. సెక్యూరిటీ మేనేజర్‌ పవన్‌ దహియా మహిళ ఉద్యోగిని చీర లాగి, బలవంతంగా తన ఒడిలో కూర్చుపెట్టుకునేందుకు యత్నించాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం బయటకు వచ్చింది.

 తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అతను కొంతకాలంగా బలవంతం చేస్తున్నాడు.  జూలై 29న ఆమె పుట్టినరోజు కావడంతో పవన్‌ దహియా ఆమెను క్యాబిన్‌లోకి పిలిచి తన క్రెడిట్‌ కార్డు ఇచ్చి గిఫ్ట్‌ కొనుక్కోవాలని సూచించాడు.అయితే అందుకు ఉద్యోగిని అంగీకరించకపోవడంతో ఆమె చీర పట్టుకొని లాగి తనపై కూర్చోమని బలవంతం చేశాడు. ఇదంతా గమనిస్తున్న మరో ఉద్యోగిని అక్కడినుంచి బయటకు వెళ్లమని పంపించి లైంగిక వేధింపులకు గురి చేశాడు. 

ఈ విషయాన్ని బాధితురాలు అదేరోజు రాత్రి మానవ వనరుల విభాగానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. తర్వాత రోజు ఉదయం ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లు హెచ్‌ఆర్‌ నుంచి నోటీసులు ఇచ్చింది. అలాగే సెక్యూరిటీ మేనేజర్‌ను హోటల్‌ యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. కాగా బాధితురాలు ఈ సంఘటనపై ఆగస్టు ఒకటో తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

"‘రెండేళ్లుగా అక్కడ పని చేస్తున్నా. శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అతను నాపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆరోజు గదిలోకి పిలిచి నా చీర లాగాలని యత్నించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి చూస్తూనే ఉన్నాడు తప్ప స్పందించలేదు. నేనే అతన్ని అడ్డుకున్నా. సీసీ పుటేజీ వీడియోలను ఓ అధికారిణికి చూపించి, విషయంపై ఫిర్యాదు చేస్తే వార్నింగ్ లెటర్ తో సరిపెట్టారే తప్ప అతనిపై చర్యలు తీసుకోలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను." అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. 


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే