//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓ స్టార్ హీరో మహిళా జర్నలిస్ట్ ను బలవంతం చేసాడు..

Category : movies

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు ఇది మీటు పేరుతొ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనిపై మొదటిగా నటి శ్రీ రెడ్డి పెద్ద ఉద్యమమే చేసింది. తర్వాత అది సద్దుమణిగింది. మళ్ళి బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్, సింగర్ చిన్మయి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటివరకు ఇండస్ట్రీ లోనే అనుకున్న ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఏకంగా మీడియా వరకు పాకింది. ఓ తెలుగు మహిళా జర్నలిస్ట్ తనను లైంగికంగా వేధించాడు అంటూ ఓ టాలీవుడ్ హీరో పై ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ రచ్చ అవుతోంది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండ్రస్ట్రీలోనే కాదని అన్ని రంగాల్లో ఇది ఉందని ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారని అర్ధం అవుతోంది.

ఇప్పుడు మీటు ఉద్యమం ఉదృతస్థాయిలో ఉండటంతో ఓ మహిళా జర్నలిస్ట్ ఈ వ్యవహారంలో బయటకొచ్చారు. గతంలో తనపై జరిగిన కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు.

పెళ్లికి ముందు టాలీవుడ్ లో సినిమా జర్నలిస్ట్ గా పనిచేసిన తనను ఓ హీరో లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. ఆ తరువాత ఓ నైట్ పార్టీలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత తనను అనేకసార్లు గెస్ట్ హౌజ్ కు పిలిచాడని చెప్పుకొచ్చింది ఆ తెలుగు మహిళా జర్నలిస్ట్ .