Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ "సాహో" కలెక్షన్ల కు భారీగా గండి కొట్టబోతున్న..... స్టార్ హీరో అక్షయ్ కుమార్.

Category : movies

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "సాహో". బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.అంతే కాకుండా ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు దాదాపు ఒక సంవత్సర కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో "రన్ రాజా రన్ ఫేమ్" సుజీత్ దర్శకత్వంలో..... వంశీ మరియు ప్రమోద్లు నిర్మాతలు గా సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజగా రిలీజ్ అయిన సాహో సినిమా టీజర్ చూస్తేనే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా రఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కించా డు ఈ చిత్ర దర్శకుడు సుజీత్. హాలీవుడ్ స్థాయిలో సుజీత్ మేకింగ్ వాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్నీ టీజర్ విడుదల తర్వాత ప్రతి ఒక్క మేకర్ అభిప్రాయం ఇదే అన్నట్లుగా తెలుస్తోంది.ఇక సాహో టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ చిత్రంకు ఎంతటి ఆసక్తి ఉందో తేలిపోయింది.

టీజర్ విడుదలైన 24 గంటల్లోనే దాదాపు అన్ని భాషల్లో కలుపుకుని 50 మిలియన్ ల వ్యూస్ ను రాబట్టింది. సాహో టీజర్ కు మన తెలుగులో దాదాపు 15 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారని హిందీ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజగా ఈ సినిమా బాలీవుడ్ లో ఏ స్థాయి వసూళ్లను రాబట్టగలదనే విషయం పై ప్రస్తుతం ఓ చర్చ జరుగుతోంది.ఈ సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో బాలీవుడ్ రైట్స్ భారీ మొత్తంకు అమ్ముడు పోయాయి. కాని సాహో చిత్రంకు పోటీగా అక్షయ్ కుమార్ నటిస్తున్న "మిషన్ మంగళ్" విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ మూవీతో ప్రభాస్ మూవీ పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా గతంలో అక్షయ్ కుమార్ సినిమాలతో పోటీ పడి చతికిల పడిపోయారు. ఇప్పుడు సాహోతో ప్రభాస్ ఏ స్థాయిలో అక్షయ్ ని ఢీ కొట్టగలడనేది అసలు అనుమానం.అక్షయ్ పోటీ లేకుండా సోలో రిలీజ్ అయితే సాహో చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం..కానీ అక్షయ్ కి దీటుగా సాహో రిలీజ్ అయితే వసూళ్లు తగ్గే అవకాశం ఉంది.అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు సాహో టీమ్.

Related News