//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పడకేసిన పారిశ్రామిక రంగం... ప్రతికూల వృద్ధి

Category : business


పారిశ్రామికం మళ్లీ పడకేసింది. తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రుణాత్మకం లోకి మళ్లింది. జూన్ నెలకుగాను సూచీ - 0.1 శాతానికి జారుకుంది. గనులు, విద్యుత్ ఉత్పత్తి, మౌలిక/నిర్మాణ పరికరాలు, వినియోగదారుల వస్తువులు కూడా నిరాశాజనక పనితీరు కనబర్చడంతో పారిశ్రామిక రంగ మరింత పతనమవడానికి కారణమైంది.

అంతక్రితం ఏడాది ఇదే నెలలో పారిశ్రామిక రంగ వృద్ధి 8 శాతంగా నమోదైందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక వృద్ధిరేటు రుణాత్మక జోన్‌లోకి రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో 3.4 శాతంగా నమోదవగా, ఆ తర్వాతి నెలలో 2.8 శాతంగా ఉంది.

ఐఐపీ డాటాలో 77 శాతం వాటా కలిగిన తయారీ రంగ వృద్ధి - 0.4 శాతానికి పడిపోయింది. 2016 సంవత్సరం ఇదే కాలానికి 7.5 శాతంగా ఉంది. గనులు, విద్యుత్ రంగాలు కూడా నిరాశాజనక పనితీరును కనబరిచాయి. జూన్‌లో గనుల వృద్ధి 10.2 శాతం నుంచి 0.4 శాతానికి పరిమితమవగా, విద్యుత్ వృద్ధి 9.8 శాతం నుంచి 2.1 శాతానికి జారుకుంది. పెట్టుబడులకు ప్రామాణికమైన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 6.8 శాతంగా నమోదైంది.

గతేడాది ఇదే నెలలో నమోదైన 14.8 శాతంతో పోలిస్తే రెండింతలు తగ్గింది. అలాగే ప్రాథమిక వస్తువులలో వృద్ధి 0.2 శాతంగాను, ఇంటర్‌మీడియట్ గూడ్స్‌లో 0.6 శాతానికి తగ్గాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్ -2.1 శాతంగాను, కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ రికార్డు స్థాయి 4.9 శాతం వృద్ధిని కనబరిచింది. 23 పారిశ్రామిక విభాగాల్లో 15 రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పారిశ్రామిక వృద్ధిరేటు 2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వృద్ధి 7.1 శాతంగా ఉంది.