//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైల్వే స్టేషన్ల వేలానికి రంగం సిద్ధం !

Category : business

దేశంలో 400 రైల్వే స్టేషన్లను అత్యాధునిక స్టేషన్ లుగా ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనకు గత మూడేళ్ళుగా స్పందన లభించక పోవడంతో ఇప్పుడు రైల్వే శాఖ రైల్వే స్టేషన్ ల వేలానికి రంగం సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి కోసం దేశంలో ప్రధానమైన కొన్ని స్టేషన్ల వేలానికి సిద్దపడుతున్నారు. మొదటి విడతగా ఈ నెల 28న  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌, అల‌హాబాద్ స్టేష‌న్లను వేలం వేయ‌నున్నారు. 

ఆస‌క్తి ఉన్న కంపెనీలు రైల్వే వెబ్‌సైట్‌లోకి వెళ్లి బిడ్లు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. కాన్పూర్ స్టేష‌న్ బేస్ ప్రైస్ రూ.200 కోట్లు కాగా,  ల‌హాబాద్ స్టేష‌న్ రూ.150 కోట్లుగా నిర్ణ‌యించారు. జూన్ 30న వేలం వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు.

మొదటి దశలో దేశంలోని 25 ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో బెంగ‌ళూరు, ముంబైలోని లోక‌మాన్య తిల‌క్ స్టేష‌న్‌, పుణె, థానె, విశాఖ‌ప‌ట్నం, హౌరా, అల‌హాబాద్‌, కామాఖ్య‌, ఫ‌రీదాబాద్‌, జ‌మ్ము తావి, బెంగ‌ళూరు కంటోన్మెంట్‌, భోపాల్‌, ముంబై సెంట్ర‌ల్‌, బోరివాలి, ఇండోర్ ఉన్నాయి. 

రూ.30 వేల కోట్ల పెట్టుబ‌డితో ఈ 25 స్టేష‌న్ల‌ను పీపీపీ ప‌ద్ధ‌తిలో పున‌రుద్ధ‌రించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఇందులో భాగంగా స్టేష‌న్ల‌లోని ప్లాట్‌ఫామ్‌లు, లాంజ్‌ల‌ను ఆధునీక‌రిస్తారు. హోట‌ళ్లు, మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్‌లు నిర్మిస్తారు.