//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ - శ్రీలంక సమరానికి సిద్దమైన గాలే !

Category : sports


ఓవైపు ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్, మరోవైపు సొంతగడ్డపై పూర్తి ఆధిపత్యం చూపెడుతున్న శ్రీలంక, దాదాపు నాలుగు నెలల తర్వాత టెస్టు ఫార్మాట్ ఆడుతున్న టీమ్‌ఇండియా, ఇటీవలే రికార్డు ఛేదనతో జోరుమీదున్న లంకేయులు.. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఐదు రోజుల సమరానికి రంగం సిద్ధమైంది.

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి జరిగే తొలి టెస్టులో భారత్, లంక అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండేండ్ల కిందట గాలే వేదికపై లంక చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన కసరత్తు చేస్తుండగా, ఇటీవల ఆడిన ఆరు టెస్టుల్లో ఐదు విజయాలు సాధించిన ఆతిథ్య జట్టు మరో సంచలనం కోసం ఆరాటపడుతున్నది.

గత రెండేండ్లలో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోగా, సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత లంక సంధి దశను ఎదుర్కొంటున్నది. కాబట్టి ఈ సిరీస్‌ను భారత బ్యాటింగ్‌కు, లంక బౌలింగ్‌కు పరీక్షగా పేర్కొనవచ్చు. భారత్‌ కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రవిశ్రాస్తి యాక్షన్‌ అమలుల్లోకి రానుంది. 2015లో టీమ్‌ డైరక్టర్‌గా జట్టుకు సిరీస్‌ విజయాన్ని అందించిన శాస్త్రి సారథ్యంలో విరాట్‌ అండ్‌కో తొలి బోణి కొట్టాలన్న కసితో ఉంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య కూడా టెస్ట్‌ అరంగేట్రం చేయనున్నాడు.