Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"ఆర్. ఆర్.ఆర్" టైటిల్ పై పునరాలోచనలో జక్కన్న....!

Category : movies

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ ఆర్ఆర్ఆర్” ఈ సినిమా చిత్రీకరణలో బాగంగా రెండో షెడ్యూల్ కూడా మొదలై పోయింది. ఈ సినిమా ను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక విశేషం తెగ వైరల్ గా మారుతూనే ఉంది. మరి జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం హైప్ ఉంటుందనే చెప్పుకోవాలి. బాహుబలి లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన సినిమాను తెలుగు ఇండస్ట్రీ కి ఇచ్చిన తరువాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్ సినిమాల స్థాయికి వెళ్ళిపోయింది.ఏందరో బాలీవుడ్ , హాలీవుడ్ ప్రముఖులు తమ ఇండస్ట్రీ లో పని చేయమని అడిగినా, తెలుగు సినిమా మీద ఉన్న మమకారం తో తెలుగు సినిమా స్థాయిని మరింత ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.

అందుకోసమే టాలీవుడ్ టాప్ స్టార్స్ నీ ఒప్పించి భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ మూవీకి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు రాజమౌళి. అందుకే అయన సినిమాలకు అంత క్రేజ్."ఆర్ఆర్ఆర్” సినిమా లో నటించడం కోసం చాల మంది అగ్ర తారాలు పోటి పడ్డారు. లీడ్ రోల్ లో జూనియర్ ఎన్టిఆర్, రామ చరణ్ తేజ్ ఉన్నా మన బాహుబలి లాంటి రాజమౌళి దర్శకత్వం లో పనిచేయడమే అదృష్టం అని భావించి సైడ్ రోల్ లో కూడా పోటిపడుతున్నారు. ఇదిలా ఉండగా తారక్ కు షూటింగ్ లో గాయం కావడం తో ఒక వారం షెడ్యూల్ వాయిదా పడినా సరే మన రాజమౌళి మిగితా నటుల షాట్స్ ను కవర్ చేస్తున్నారట.

ఇదేనేమో సమయపాలన అంటే.ఈ సినిమా కోసం బాలీవుడ్ అగ్ర తార అలియా భట్ కూడా ఆసక్తి చూపి మరి మన డైరెక్టర్ దగ్గర ఛాన్స్ కొట్టేసింది. ప్రతీ పాత్ర కుడా చాల విశేషంగా ఆకట్టుకోనుంది అని అర్ధమవతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారి అంచనాలే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా చిత్రం మొదలైన దగ్గర నుండి దీని టైటిల్ “ ఆర్ఆర్ఆర్” గానే ఉండిపోయింది. కానీ రాజమౌళి మాత్రం ఈ సినిమా టైటిల్ ను పెట్టె భాద్యత ప్రేక్షకులకే వదిలేశారు. ఏక్కువ శాతం రామ రావణ రాజ్యం , రఘుపతి రాఘవ రాజారామ్, అని సూచించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టైటిల్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.త్వరలోనే ఈ సినిమా టైటిల్ సంబంధించి ఓ అంచనాకు రానున్నట్టు తెలుస్తోంది.చూడాలి మరి ఏ టైటిల్ నీ ఫైనల్ చేస్తారన్నది.

Related News