//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Sruthi Hassan Movies : శృతి హాసన్ సినిమాలు : Hot Actress Sruti Hasan photos family images videos marriage galleries caste bio data

Category : editorial

శృతి హాసన్ ఒక ప్రముఖ నటి మరియు గాయని. ఈమె ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురు.ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తుంది.జనవరి 28, 1986 లో చెన్నై లో జన్మించింది.శృతి హాసన్ కు శృతి రాజ్యలక్ష్మి హాసన్ అనే ఇంకో పేరు ఉంది.

2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది.

2011లో కె.రాఘవేంద్రరావు గారి కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది.కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది.

తరువాత తమిళం లో మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన "7అం అరివు" సినిమాలో నటించింది.ఆ సినిమాకు గాను తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్నది.

అప్పటివరకు ఎన్నివిజయాలున్న 2012 లో పవర్ స్టార్ హీరోగా,హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా శృతి కెరియర్ ని మరో స్థాయి కి తీసికెళ్ళింది.ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది.

2013 నవంబరు 20 న గుర్తు తెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది.‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు, నాతో ఎందుకు మాట్లాడడం లేదు’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది.తర్వాత అతడు పారిపోయాడు.

ప్రస్తుతం శ్రుతి తన తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి 'శభాష్‌ నాయుడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

Related News