//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీరెడ్డి ఖేల్ ఖ‌తం.. నో నాకు కావాల్సింది కూడా అదే..!

Category : movies

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్ పై కొద్ది రోజులుగా ర‌చ్చ చేస్తున్న శ్రీరెడ్డి కొద్ది రోజులుగా నానిని టార్గెట్ చేసి ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నేప‌ధ్యంలో శ్రీరెడ్డి ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా లైట్ తీసుకున్న నాని.. ఆమె మ‌రీ హ‌ద్దులు దాట‌డంతో నాని శ్రీరెడ్డికి లీగ‌ల్ నోటీసులు పంపి షాక్ ఇచ్చాడు. అవి అందుకున్న ఏడూ రోజుల్లో సిటీ సిటీ సివిల్ కోర్ట్ కు వివరణ ఇవ్వాలని నానీ తరుపు లాయర్లు సూచిస్తున్నారు.

ఇకపోతే శ్రీరెడ్డి కొద్ది రోజులుగా నాని పై మ‌రీ ధారుణంగా కామెంట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు మూడు రోజులుగా అయితే.. కొంచెం మసాలా పెంచి.. నాని తనతో గడిపాడంటూ తీవ్ర అభ్యంతర పదజాలంతో పోస్టింగ్ చేయటంతో ..అది పెద్ద సంచలనంగా మారింది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా శ్రీరెడ్డిని తమ షోకు పరిశీలించామని..అయితే అలా పరిశీలించిన వారిని అందరినీ తీసుకోవటం సాధ్యం కాదని వివరణ ఇచ్చింది.

అయితే నాని కారణంగానే తనకు ఛాన్స్ మిస్ అయిందనే భావనలో శ్రీరెడ్డి ఉన్నారు. నాని వ్యవహారంతో సడన్‌గా శ్రీరెడ్డి మళ్లీ మీడియాకి ఎక్కింది. ఈ నేప‌ధ్యంలో శ్రీరెడ్డి విమర్శలకు నాని లీగల్ నోటీసులు పంపటంతో ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అయితే నాని త‌రుపున లాయ‌ర్లు పంపిన‌ లీగల్ నోటీసుల పైనా శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు. బాధిత మహిళలు ఏడుస్తూ కూర్చోకుండా ఎలా పోరాడాలో నేను చేసి చూపిస్తాన‌ని శ్రీరెడ్డి అన్నారు.

ఇక తన పుట్టిన రోజు సందర్భంగా వేరే ప్రాంతానికి వెళ్తుంటే లీగల్ నోటీసులు విషయం తెలిసిందన్నారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందని నానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా ఫైట్‌ చేద్దాం.. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వస్తాను.. అప్పుడు నాని సంగతి చూస్తానని తెలిపారు. ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని ఛాలెంజ్‌ విసిరారు శ్రీరెడ్డి.