//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒరే.. నీ అ... బ‌డ‌వ‌ల్లారా - ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు శ్రీ‌రెడ్డి స‌ల‌హా..!

Category : movies

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ అన్న‌ట్టే శ్రీ‌రెడ్డి పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. అందుకు కార‌ణం ప్ర‌తీ ఒక్క‌రికి తెలిసిందే. అదే. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో యువ‌తుల‌పై సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న లైంగిక దాడుల‌పై గ‌ళ‌మెత్త‌డ‌మే. అంతేకాకుండా, మ‌హిళా సంఘాలు సైతం శ్రీ‌రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపాయి. పోరాడాయి. ధ‌ర్నా చేశాయి. ఈ క్ర‌మంలోనే స్పందించిన జాతీయ మానవ హ‌క్కుల సంఘం క‌మిష‌న్ శ్రీ‌రెడ్డి విష‌యంపై విచార‌ణ చేసేందుకు సిద్ధ‌మైంది. ఇప్పుడు విచార‌ణ కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా, శ్రీ‌రెడ్డి ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫ్యాన్స్‌కు స‌ల‌హా ఇచ్చింది.

ఒరేయ్ నీ అ.. బ‌డ‌వ‌ల్లారా అంటూ మొద‌లు పెట్టింది. అత‌నికేదో తిక్క ఉంద‌ని సినిమాల్లో చెబితే..ఆ తిక్క‌ను మీరు కూడా రుద్దుకుంటారా..? అలా చేస్తే మీరు కూడా అత‌నిలాగే తిక్క‌వోళ్లుగా మిగిలిపోతార‌ని, దేవుడు ప్రతీ ఒక్క‌రికి బుర్ర ఇచ్చాడు క‌దా..! ఆ బుర్ర‌తో ఒక్క సారి ఆలోచించండి అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి శ్రీ‌రెడ్డి చెప్పింది. ఏదో సినిమాల్లో నాలుగు డైలాగ్స్ చెప్తే.. ప‌వ‌న్ దేవుడై పోతాడా..? అంటూ ఫ్యాన్స్‌ను ప్ర‌శ్నించింది. రాజ‌కీయాల్లో ఎవ‌రు ఉన్నారు..? వారి అనుభ‌వం ఎంత‌..? ఏం చేస్తున్నారు..? రాజ‌కీయాల్లోకి ఎలా వ‌చ్చారు...? వారికి పాలించే స‌త్తా ఉందా..? రాజ‌కీయాల‌పై వారికి ఉన్న అవ‌గాహ‌న ఎంత‌..? ఇవ‌న్నీ ఆలోచించ‌కుండా.. డ‌బ్బు ఉంది క‌దా అని పార్టీ పెట్టిన వారికి జై కొట్ట‌కండి.. కుల రాజ‌కీయాల‌కు దూరంగా ఉండండి అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.