Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హీరో నాని పై శ్రీరెడ్డి కామెంట్స్ .....నీ కొడుకునైనా జాగ్రత్తగా పెంచు రా ...?

Category : movies

టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన నటి " శ్రీ శక్తి శ్రీ రెడ్డి".. చిత్ర సీమలో కాస్టింగ్ కౌచ్ అని ఉవ్వెత్తున ఉద్యమం మొదలు పెట్టి ఎన్నో వివాదాలకు తేర తీసింది. తాజాగా మరోసారి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తోంది. కోలివుడ్ లో సినిమా ఆఫర్లు వచ్చాయని చెన్నైకి వెళ్లిన ఈమె మళ్లీ హైదరాబాద్ కి తిరిగొచ్చింది. పోనీ ఇక్కడ ఏమైనా సైలెంట్ గా ఉందా అంటే, అదీ లేదు..గతంలో కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన ఈమె మరోసారి వారిపై విమర్శలు గుప్పిస్తోంది.సోషల్ మీడియా వేదికగా వరుస పెట్టి కామెంట్స్,ట్వీట్స్ తో టాలీవుడ్ ప్రముఖులపై వివాదాస్పద బాణాలు వదులుతుంది.ఇప్పటికే కొరటాల శివ, దగ్గుబాటి ఫ్యామిలీలపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి చనిపోయిన రామానాయుడిని కూడా వదలడం లేదు .ఆయనకి అమ్మాయిల పిచ్చి అంటూ అసభ్యకర పదజాలంతో దూషించింది.అక్కడితో ఆగకుండా అయన అభిమానం కొద్దీ హీరోయిన్స్ దిగిన ఫోటోలను కూడా బయటికి తీస్తూ వాటికి బూతులతో కూడిన కామెంట్స్ పెడుతుంది.

ఇది ఇలా ఉంటె మరో వైపు గతంలో హీరో నానిపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి మరోసారి అతడిని టార్గెట్ చేసింది.

నాని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ''అయోమయం ఊరిలో ఉండే నానిగా ఇంట్లో పిల్లోడున్నాడు. సిగరెట్ ఆపావా లేదా..? నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా...బాగా పెంచు వాడిని'' అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఇప్పటికే ఒకసారి నాని.. శ్రీరెడ్డి పోస్ట్ లపై స్పందించి లీగల్ గా చర్యలు తీసుకుంటామని చెప్పాడు. మరి ఇప్పుడు శ్రీరెడ్డి తన కొడుకు జోలికి కూడా వస్తోంది. మరి నాని ఈ విషయం పై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి .

Related News