//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీరెడ్డి లీక్స్‌.. క‌త్తి మ‌హేష్ ఇరుక్కుంటాడా.. త‌ప్పించుకుంటాడా...?

Category : movies

శ్రీరెడ్డి ప్ర‌కంప‌న‌లు రోజు రోజుకీ ఉదృతం అవుతున్నాయి. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పోరు ఏ ముహుర్తాన మొద‌లు పెట్టిందో కానీ.. రోజుకో లీకుతో టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ఇక అసలు మ్యాట‌ర్ లోకి వెళితే శ్రీరెడ్డి తాజాగా సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత తనను కత్తి మహేష్ బలవంతం చేసాడని ఓ టీవీ ఛానల్ కార్య క్రమంలో చెప్పడం తో మహేష్ అసలు స్వరూపం బయటపడింది. దీంతో శ్రీ రెడ్డి తన ట్విట్టర్‌లో మహేష్‌కు శిక్ష పడేవరకు పోరాటం చేస్తానని తెలిపింది.

ఇక తాజాగా న్యూస్ చానల్స్‌కి వచ్చి డిబేట్స్‌లో కూర్చుని నీతులు చెప్పటం కాదు.. కత్తి మహేష్ నీకు సిగ్గువుండాలి, మా ఉద్యమంలో ఆడవారికి అన్యాయం చేసిన ఎవరైనాసరే వారికి శిక్ష పడేవరకు మేం పోరాడుతూనే ఉంటాం.. ఇప్పుడు నువ్వు చేసిన పనికిమాలిన పనికి నువ్వే రివ్యూ చెప్పుకో ఛీ నీ బ‌తుకు అంటూ శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క మహేష్ మాత్రం నేను అలాంటి పని చేయలేదని , సునీత ఫై పరువు నష్టం దావా వేస్తానని, సరైన ఆధారాలు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇప్పుడు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల పై క‌త్తి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related News