//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహానటి పేరుతో.. ధారుణంగా వ్యాపారం చేస్తున్నారు..!

Category : movies

వెండితెర మ‌హాదృశ్య‌కావ్యం మ‌హాన‌టి చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంతో ఆమె పాత్రలో కీర్తి సురేష్ న‌టించిగా., జెమినీ గణేషన్ రోల్‌లో దుల్కర్ సల్మాన్ న‌టించారు. ఇక ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని చూసిన ప్రేక్షకులంటున్నారు. ఇప్పుడు ఏ నోట విన్నా మహానటి గురించే.. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించేసిందని ప్రశంసలు.. చిరంజీవి, అల్లు అర్జున్, రాజ‌మౌళి ఇలా అంద‌రు మ‌హామ‌హుల నుంచి మహానటి టీంకు ప్రశంసలు దక్కాయి.

అయితే వివాదాల శ్రీరెడ్డి మాత్రం ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహానటి సావిత్రి బతికున్నప్పుడు ఆర్థికసాయం కోసం ఆర్థించినప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదని... ఆమె చనిపోయాక మాత్రం కోట్లు కుమ్మరించి ఆమె పేరు పై వ్యాపారం చేసుకుంటున్నారని శ్రీరెడ్డి వ్యాఖ్య‌లు చేసింది. . మహానటి అంటున్నారు.. ఆ తల్లి సావిత్రి చివరి వరకు త్యాగాలు, దానాలు చేస్తూనే పోయింది... హ్యాట్సాఫ్ తల్లి. కొత్త తెలుగు మహానటిమణులను డ్రగ్స్, అల్కాహాల్ ఆడిక్ట్ లుగా చేసి వాళ్ల టాలెంట్‌ను పక్కలకు పరిమితం చేసి.. వారితో శృంగారం చేసి. కోర్కెలు తీర్చుకొని.. ఆ త‌ర్వాత వారిని మోసం చేసి.. పక్క రాష్ట్రాల నుంచి మహానటులను వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం మన నిర్మాతలకు దర్శకులకు పడుతోంది.. తూ.. మీ బ‌తుకులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.. మ‌రి ఈ వ్యాఖ్య‌ల పై సినీ జ‌నాలు ఎలా స్పందిస్తారో చూడాలి.