//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెల్ల‌చీర‌, మ‌ల్లెపూలు.. చివ‌రికి..ఛీ..ఛీ..!

Category : movies

టాలీవుడ్‌కు చెందిన కొంద‌రి ప్ర‌ముఖుల పైత్యాల‌ను శ్రీ‌రెడ్డి బ‌య‌ట‌పెట్టింది. టాలీవుడ్‌లోని ప్ర‌ముఖుల్లో ఎవ‌రికి ఏం ఏం ఇష్ట‌మో... ఎలా ఉంటే ఇష్ట‌మో శ్రీ‌రెడ్డి బ‌హిర్గ‌తం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ గురించే చెప్పిన శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ కు ముందు జ‌రిగే త‌తంగాన్ని ఇటీవ‌ల ఓ సోష‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. తెర‌ముందు కాకుండా... తెర వెనుక జ‌రిగే భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఆఖ‌రుకు రేపో మాపో పోయే వారిని సైతం భ‌రించాల్సి వ‌స్తుంది అంటూ క‌న్నీరు పెడుతూ శ్రీ‌రెడ్డి చెప్ప‌డం ప‌లువురిని కంట‌త‌డి పెట్టించింది.

మ‌న‌సుకు న‌చ్చిన వారితో చేసే వారితో రిలీజ‌య్యే ఆమ్లాలు వేరే ఉంటాయి. ఇష్టం లేని వారితో శృంగారం చేస్తూ రాని మూలుగుల‌ను మూలుగుతూ.. మ‌నం న‌టించాల్సింది కెమెరా ముందు క‌దా..? ఇలా ఎందుకు చేయాల్సి వ‌స్తుంది..? నా లైఫ్ ఇంతేనా..? ప‌లు ప్ర‌శ్న‌లు న‌న్ను వేధిస్తుంటాయి. అటువంటి ఘ‌ట‌నలు న‌న్ను వేధించాయి అంటూ చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి. కేవ‌లం నా క‌ల‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు నేనొక బొమ్మ‌లా త‌యార‌వుతా, ఒక‌డేమో తెల్ల‌చీర, మ‌ల్లెపూలు క‌ట్టుకు రమ్మంటాడు.. మ‌రొక‌డేమో ప‌సుపు చీర‌..క‌న‌కాంబ‌రాలు పెట్టుకుర‌మ్మంటాడు, ఇంకొక‌డు ఫోన్ చేసి సేఫ్టీస్ తెమ్మంటాడు.. ఇలా అనేక ర‌కాలుగా నా గ‌త జీవితాన్ని అనుభ‌వించాను. అందులో అభిరామ్ ఒక‌డు అంటూ చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి.