//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ద‌గ్గుబాటి అభిరామ్‌తో భాగోతం.. సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన శ్రీ‌రెడ్డి..!

Category : movies

శ్రీ‌రెడ్డి, తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వ‌య‌స్సును సైతం లెక్క చేయ‌కుండా యువ‌తుల నుంచి ఆరుప‌దుల వ‌య‌స్సు దాటిన వారిపై కూడా సినీ ప్ర‌ముఖులు లైంగిక దాడికి పాల్ప‌డుతున్నారు. అంతేకాకుండా, సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తామంటూ యువ‌తుల‌ను గెస్ట్‌హౌస్‌కు ర‌ప్పిస్తున్నారంటూ ఇటీవ‌ల కాలంలో శ్రీ‌రెడ్డి ప‌లు సోష‌ల్ మీడియా ఛానెళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇదే క్ర‌మంలో టాలీవుడ్ బ‌ఢా ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి అభిరామ్, త‌న‌కు మ‌ధ్య ఎలా ప‌రిచయం అయ్యింది..? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని ఓ ప్రాంతంలో సురేష్‌బాబుకు హార్బ‌ర్‌, ఎఫ్ క్ల‌బ్‌తోప‌లు ప‌లు ప్రాప‌ర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాప‌ర్జీస్ చూసుకునేందుకు అభిరామ్ అక్క‌డ‌కు వ‌స్తుండే వాడు. అయితే, ఆ ఎఫ్ క్ల‌బ్‌ను మా ఫ్రెండ్ లీజుకు తీసుకుంది. ఆ క్ర‌మంలోనే నేను కూడా ఫ్రెండ్‌తో క‌లిసి ఎఫ్ క్ల‌బ్‌కు వెళుతుండే దాన్ని. అయితే, రెండు సంవ‌త్స‌రాల‌కు ముందే అభిరామ్ న‌న్ను ఫేస్‌బుక్‌లో కాంటాక్ట్ అయ్యాడు. నెంబ‌ర్ అడిగాడు. చాలా అందంగా ఉన్నావంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు అంటూ చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి. అయితే, నా ఫ్రెండ్‌తో క‌లిసి ఎఫ్‌క్ల‌బ్‌కు వెళ్లిన న‌న్ను చూసిన అభిరామ్ చొంగ కార్చుకున్నాడ‌ని, అదే సంద‌ర్భంలో వాళ్ల నాన్న, తాత‌, అన్న‌య్య‌ల పేర్లు చెప్పి త‌న ఫోన్ నెంబ‌ర్ తీసుకున్న‌ట్టు చెప్పింది శ్రీ‌రెడ్డి. ఇలా కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు చెట్లు, పుట్ట‌లపై తిప్పాడ‌ని, క‌థాకార్య‌క్ర‌మాలు అయిన త‌రువాత అభిరామ్ త‌న‌ను వ‌దిలేసి వెళ్లిన‌ట్టు చెప్పింది శ్రీ‌రెడ్ది.