//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీనివాస కళ్యాణం......టీజర్ రివ్యూ....

Category : movies

టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్‌ నటిస్తున్న ప్రస్తుతం చేస్తున్న సినిమా 'శ్రీనివాస కల్యాణం'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా చేస్తుంది,నందితా శ్వేత మరో హీరోయిన్ .

ఈ చిత్రానికి వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

దాదాపుగా దిల్ విజయం తరువాత నితిన్ తో మళ్ళీ దిల్ రాజు సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ టీజర్‌ను చిత్రబృందం ఈరోజు ఉదయం 9 గంటలకి విడుదల చేసింది.

'శ్రీనివాస కల్యాణం కాన్సెప్ట్ అంటూ వచ్చిన ఈ ట్రీజర్ లో ఏముందో చూద్దామా..... 'మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ సంతోషిస్తారు. ఈ విషయం మనకు తెలీదు. మనం చనిపోయినప్పుడు అందరూ బాధపడతారు. ఈ విషయం కూడా మనకు తెలీదు. మనకు తెలిసినంతవరకు మనం సంతోషంగా ఉండి మనవాళ్లంతా సంతోషంగా ఉండేది ఒక పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ 'శ్రీనివాస కల్యాణం'' అంటూ ప్రముఖ నటి జయసుధ వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ సినిమా నేపథ్యం గురించి వివరించారు.

'కల్యాణం.. వైభోగం' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న సంగీతం వినసొంపుగా ఉంది. అలాగే ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 22 రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు. అలాగే ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.