//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీనివాసకళ్యాణం స్పెషల్ షో రివ్యూ...!

Category : movies

శ్రీనివాస కళ్యాణం నితిన్ , రాశిఖన్నా జంటగా నంటించిన చిత్రం. తెలుగు సంప్రదాయ వివాహాల ప్రాముఖ్యతని తెలియజేసే ముఖ్యమైన అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టాలీవుడ్ లోని భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దిల్ రాజు సెలెబ్రిటీల కోసం శ్రీనివాస కళ్యాణం స్పెషల్ షో వేయించారు. ప్రముఖ దర్శకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది. నాని నటించిన నేను లోకల్ దర్శకుడు త్రినాథ్ రావు ఈ స్పెషల్ షో అనంతరం మాట్లాడుతూ ఈ చిత్రం చూశాక పదేళ్ల క్రితం జరిగిన తన వివాహం తనకు గుర్తుకు వచ్చిందని త్రినాథ్ రావు అన్నారు.

ఈ చిత్రాన్ని చూసిన ప్రతి దర్శకుడు క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ప్రకాష్ రాజ్, నితిన్ మధ్య జరిగే సంభాషణ అద్భుతంగా ఉన్నట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశంలో సంభాషణ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ శ్రీనివాస కళ్యాణం చూసిన అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు...

శ్రీనివాస కళ్యాణం చిత్రం అన్ని తరాల వారు చూడదగ్గ చిత్రం అని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. పెళ్లైన వారు వారిని వారు ఈ చిత్రంతో గుర్తు చేసుకుంటారు. పెళ్లి కానీ వారు తమ పెళ్లి ఇలా జరగాలని కోరుకుంటారు. దీనిని బట్టి చూస్తే ఈ శ్రీనివాస కళ్యాణం టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించే విధంగా ఉంది అని డైరెక్టర్స్ తెలిపారు. ఈ సినిమా పూర్తీ రివ్యూ తెలియాలంటే రేపటివరకు వేచిచూడక తప్పదు.

Related News