//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీముఖి బిగ్ బాస్ షాకింగ్ రెమ్యూనిరేషన్

Category : movies

తెలుగులో బిగ్ బాస్ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. మొదటి రెండు సీజన్స్ అనుకున్న దానికంటే బాగా సక్సెస్ అయ్యాయి. దీనితో మూడో సీజన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే మొదటి నుండి సీజన్ 3 గురించి సరైన అప్డేట్ ఏమి లేకుండానే ముందుకి సాగింది. మొదటిలో హోస్ట్ ఎవరనేది తెలియదు. చివరికి నాగార్జునని ఫైనల్ చేశారు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ విషయానికి వస్తే సరైన సెలెబ్రిటీస్ ఎవరు కూడా బిగ్ బాస్ చేయటానికి ముందుకి రాలేదు.

దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు సరైన కాంటిస్టెంట్స్ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎలాగైనా సరే శ్రీముఖిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోని రావాలని బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే కష్టపడ్డారు. ఎందుకంటే శ్రీముఖికి బుల్లితెర మీద ఉన్న క్రేజ్ ప్రధాన కారణం. ఆమె హౌస్ లో ఉంటే బిగ్ బాస్ షోకి ఆదరణ అమాంతం పెరుగుతుంది. అసలే సరైన సెలెబ్రటీస్ దొరకటం లేదు. ఇలాంటి సమయంలో శ్రీముఖి అవసరం చాలా ఉందని భావించిన బిగ్ బాస్ టీం శ్రీముఖికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.ఆమె బిగ్ బాస్ షో కోసం 100 రోజులు డేట్స్ ఇచ్చింది. ఇందుకుగాను ఆమెకి దాదాపు “మూడున్నర కోట్లు” రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది.

ఒక సినిమాకి హీరోయిన్ అన్ని కాల్షీట్స్ ఇస్తే ఆమెకి 75 లక్షల నుండి కోటి మధ్యలో ఇస్తారు. కొంచం స్టార్ హీరోయిన్స్ అయితే 2 కోట్లు వరకు ఇస్తారు, కానీ శ్రీముఖికి మాత్రం మూడున్నర కోట్లు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాకు అందిన రిపోర్ట్స్ ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఇదే అత్యధిక రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు.