//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ లో శ్రీలంక పర్యటనకు షెడ్యూల్ ఖరారు ...

Category : sports

వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20లలో తలపడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 16న కోల్‌కోతాలో మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌కు ముందు శ్రీలంక మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది.

తొలి టెస్ట్‌కు కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుండగా రెండో టెస్ట్ నాగ్‌పూర్‌లో, మూడో టెస్ట్ ఢిల్లీలో జరగనుంది. డిసెంబరు 10 ధర్మశాలలో తొలి వన్డే జరుగుతుంది. 13న మొహాలీలో 17న విశాఖపట్టణంలో మూడో వన్డే జరగనుంది.స్వదేశం లో భారత్ చేతిలో ఘోరమైన పరాజయాన్ని చవి చూసిన లంక ఇండియన్ పిచ్ ల పై ఎలా ఆడుతుందో చూడాలి .

టెస్ట్ సిరీస్

తొలి టెస్ట్: నవంబరు 16-20- కోల్‌కతా

రెండో టెస్ట్: నవంబరు 24-28-నాగ్‌పూర్

మూడో టెస్ట్: డిసెంబరు 2-6 - ఢిల్లీ

వన్డే సిరీస్

తొలి వన్డే: డిసెంబరు 10- ధర్మశాల

రెండో వన్డే: డిసెంబరు 13 - మొహాలీ

మూడో వన్డే: డిసెంబరు 17 - విశాఖపట్టణం

టీ20 సిరీస్

తొలి టీ20: డిసెంబరు 20 - కటక్

రెండో టీ20: డిసెంబరు 22 - ఇండోర్

మూడో టీ20: డిసెంబరు 24 - ముంబై