//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆస్ట్రేలియా సిరీస్ టోర్నీ టైటిల్‌ గెల్చుకున్న శ్రీకాంత్

Category : sports

భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్, చైనా ఆటగాడు చెన్ లాంగ్‌తో తలపడ్డ శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ టైటిల్‌ను ముద్దాడాడు. దీంతో వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సాధించాడు. 

ఫైనల్ మ్యాచ్ తొలిసెట్‌లో 22-20తో ఆధిక్యంలో నిలిచినా శ్రీకాంత్.. రెండో సెట్‌(21-16)లోనూ అదే జోరు కొనసాగించి టైటిల్‌ను వశం చేసుకున్నాడు. ఇటీవలే జరిగిన ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ విజేతగా శ్రీకాంత్ నిలిచిన విషయం విదితమే. సింగపూర్ టోర్నీలో శ్రీకాంత్ రన్నరప్ గా నిలిచాడు. ఇప్పుడు ఆస్ర్టేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. 

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న  శ్రీకాంత్‌కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ఐటి మంత్రి కె టి రామారావు  శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు. కిదాంబి శ్రీకాంత్ విజయం దేశానికే గర్వకారణమని ప్రధాని, చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాంత్‌కు బీఏఐ రూ. 5 లక్షల నగదును బహుమానంగా ప్రకటించింది.